నేను మీకు తెలుసా: ఏమైందో గానీ చూస్తూ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nenu Meeku Telusa
Song Singers
   SriRam ParthaSarathy
Music Director
   Achu
Year Released
   2008
Actors
   Manchu Manoj,
   Sneha Ullal,
   Riya Sen
Director
   Ajay Shastry
Producer
   Lakshmi Manchu

Context

Song Context:
          కలలా అలాగ మది ఉయ్యాల ఊపే భావం ఏమిటో పోల్చుకో త్వరగా!

Song Lyrics

||ప|| |అతడు|
       ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్లిపోతోంది మనసెలా
       ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా
       అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం
       అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవడం
       అనుమతి కోరదే పడి లేచే పెంకితనం
       అడిగినా చెప్పదే ఏమిటో అంత అవసరం
       ఏం చేయడం మితిమీరే ఆరాటం
       తరుముతూ ఉంది ఎందుకిలా……
                                || ఏమైందో గానీ ||
.
||చ|| |అతడు|
       తప్పో ఏమో అంటుంది తప్పదు ఏమో అంటుంది
                               తడబాటు తేలని నడక
       కోరే తీరం ముందుంది చేరాలంటే చేరాలి కదా
                               బెదురుతు నిలబడక
       సంకెళ్లుగా సందేహం బిగిశాక
                               ప్రయాణం కదలదుగా
       కలలా అలాగ మది ఉయ్యాల ఊపే భావం
                               ఏమిటో పోల్చుకో త్వరగా
.
||చ|| |అతడు|
       లోలో ఏదో నిప్పుంది దాంతో ఏదో ఇబ్బంది
                       పడతావటే తొలి వయసా
       ఇన్నాళ్లుగా చెప్పంది నీతో ఏదో చెప్పింది కదా
                       అది తెలియదా మనసా
       చన్నీళ్లతో చల్లారను కాస్తైనా సంద్రంలో రగిలే జ్వాల
       చినుకంత ముద్దు తనకందిస్తే చాలు
                     అంతే అందిగా అంతేగా తెలుసా
                           ||ఏం మాయ వల||
                           || ఏమైందో గానీ ||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)