నేను మీకు తెలుసా: ఎందుకో మది నమ్మదే ఇది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nenu Meeku Telusa
Song Singers
   Hema Chandra,
   Bombay Jaisree
Music Director
   Achu
Year Released
   2008
Actors
   Manchu Manoj,
   Sneha Ullal,
   Riya Sen
Director
   Ajay Shastry
Producer
   Lakshmi Manchu

Context

Song Context:
               మొదలైన సంతోషమో?
               తుది లేని సందేహమో?

Song Lyrics

||ప|| |అతడు|
       ఎందుకో మది నమ్మదే ఇది
       ముందున్నది నిజమంతా నిజమే అన్న సంగతి
       అవునా అంటున్నది
       నన్నిలా విడిచి ఏ లోకంలో ఉంది
       మొదలైన సంతోషమో
       తుది లేని సందేహమో
.
||చ|| |అతడు|
       నువ్వే నాడు తెలుసునంది మనసు
       ఎల్లాగో ఏమో
|ఆమె|
       నిన్ను చూడగానే గుండెలో
       ఇదేమి కలవరమో
|అతడు|
       కలలైన రాని కనువింటి దారి వెలిగించు కాంతి నీకున్నది
|ఆమె|
       నడి రేయిలోని నలుపెంత గాని
       నీదైన వేకువని వింత ఏమిటుంది
.
||చ|| |ఆమె|
       కాలం వెంట కదలలేని శిలగా ఎన్నాళ్లిలాగా
|అతడు|
       ఎటు వైపు అంటే ఏ క్షణం జవాబు ఇవ్వదుగా
|ఆమె|
       పడి లేవలేవ పరుగాపుతావా అడివైన దాటి అడుగేయవా
|అతడు|
       సుడిలోని నావ కడ చేరు త్రోవ నువు చూపుతావనే ఆశ రేపుతావా
       నీకే నువ్వొక ప్రశ్నగా నిను నువ్వే వెతుక్కోకలా
       నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా
|ఆమె|
       నిన్ను ఆగనీక కొనసాగనీక తడబాటు ఏమిటో చెప్పలేనితనమా
.
.
                            (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)