|
Context
Song Context:
A fascinating self-debate by her!
తానే కనబడకుంటే ప్రాణం నిలబడదంటూ
ఒట్టేసి మరీ అతనికి చెప్పాలనిపిస్తోందీ! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఊరికే ఉండదే ఉయ్యాల ఊగే మనసు
ఊహకే అందదే అసలేమయిందో నాకు || 2 ||
ఏనాడు ఏది అందవే అనుకుంటునేవున్నా
ఈనాడే ఏలా ఎదురై ఏదో అయిపోతున్నా
ఔననా కాదనా అతనేదో అన్నాడు
ఆగనా సాగనా అంటోంది నా ఈడు
.
||చ|| |ఆమె|
రోజు అలవాటైనా తనకేసి చూడాలంటే
మరి ఈరోజేమో బిడియంగా ఉందమ్మా
ఇన్నాళ్ళు ఎప్పుడైనా ఈ సిగ్గులు తెలిసొచ్చేనా
తనచూపుల్లోనే ఏదో మాయుందమ్మా
అడుగుల అలికిడి వింటే ఎందుకు అలజడి అంటే
ఏం చెప్పేదమ్మా నిలువునా గిలిగింతలు రేపాడే
|| ఊరికే ||
.
||చ|| |ఆమె|
ఛీ.. ఛీ.. పోవే పైటా నీకేమొచ్చిందీపూట
ఈ బరువంతా ఇన్నళ్ళేమయ్యిందంటా
ఏదో ఆరాటంగా ఎద కంగారవుతూ ఉంటే
ఇది హాయో కాదో చెప్పేవాళ్ళెవరంటా
తానే కనబడకుంటే ప్రాణం నిలబడదంటూ
ఒట్టేసి మరీ అతనికి చెప్పాలనిపిస్తోందీ
|| ఊరికే ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
A village girl, with simple language, within her educational qualifications, rather explicit.
Compare this song with a well educated girl (majored in journalism), pretty much in the same context: గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
October 24th, 2009 at 7:28 pm
[...] Compare this song with a village girl, within her educational qualifications & rather explicit సింధూరం: ఊరికే ఉండదే ఉయ్యాల ఊగే మనసు . [Also refer to Page 159 in సిరివెన్నెల [...]