|
Context
Song Context:
చావైతే ఈపూట కాకుంటే రేపైన వస్తుంది తప్పించుకోలేవులే
బ్రతుకంటే మన చేతిలో ఉంది భయమంటు వదిలేస్తే మన మాటవింటుందిలే! |
Song Lyrics
కోరస్:
ఓలెలె ఓలెలె.. ఓలె
ఓలెలె ఓలెలె.. ఓలె ఓలె .. ||2||
పల్లవి: అతడు:
పారహుషారైన పాట చిటికేసి రమ్మందిరోయ్
పైలాపచ్చీసైన ఆట చిందేసి రమ్మందిరోయ్
ఓరోరి బైరాగి ఈ పొద్దు ఈ జోరు ఆపొద్దు తనివితీరా దరువెయ్యురోయ్
ఊరూర ఊరేగి ఈ డప్పు హోరెత్తి పోయేట్టు ఊపెక్కి పోనీయరొయ్
హేయ్ కస్టాలు కన్నీళ్ళకేలే వస్తూనే వుంటాయిలే
నవ్వంటు తోడుంతే చాల్లే ఏమైన చెయ్యచ్చులే
.
చరణం:
మందిలో కొందరు రాబందులై అందిందతా కాజేసి జైహింద్ అంటారా
మందలై పందలై పసికందులై జనమంతా తలలొంచేసి ఖర్మనుకుంటారా
బతకడం బరువైయ్యేలా తెగ పీడిస్తుంటే
దారుణం దారులు మూసి వేటాడుతు ఉంటే
కోరస్:
హే.. ప్రాణం విసిగి పిల్లే అయినా బెబ్బులి అయిపోదా
అతడు:
హేయ్… చీమంత ఓ చిన్ని చినుకే తుఫాను అవుతుందిలే
ఈనాటి ఈనిప్పు తునకే కార్చిచ్చు అవుతుందిలే
.
చరణం: అతడు:
చిక్కగా చీకటే కమ్మిందని
లోకం వెళ్ళి సూర్యుణ్ణి రారమ్మని పిలవాలా ?
కొండలా పాపమే పెరిగిందని కాపాడంటూ ఈ సంఘం
మన సాయం అడగాలా ?
కళ్ళలో కత్తులు దూసే కసి కలిగిందంటే
గుండెలో భగ్గున రేగే అగ్గి రగులుకుంటే
కోరస్:
నెత్తురు మండే ప్రతివాడు సూరీడే అయిపోడా
అతడు:
హేయ్ ఏ కొంప కొల్లేరు కానీ - నాకేమి పట్టిందని
నిద్దర్లో మునిగివున్న వాణ్ణి - కదిలించడం నీ పని !!
|| ఓలెలె ||
అతడు:
చావైతే ఈపూట కాకుంటే రేపైన వస్తుంది తప్పించుకోలేవులే
బ్రతుకంటే మన చేతిలో ఉంది
భయమంటు వదిలేస్తే మన మాటవింటుందిలే !
|| ఓలెలె ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
[Also refer to Pages 174-175 of సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)