నువ్వే నువ్వే: నా మనసుకేమయింది నీ మాయలో పడింది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvve Nuvve
Song Singers
   Udit Narayan,
   Nitya Santhoshini
Music Director
   Koti
Year Released
   2002
Actors
   Tarun,
   Shriya
Director
   Trivikram Srinivas
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
      గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదనీ!

Song Lyrics

||ప|| |అతడు|
       నా మనసుకేమయింది నీ మాయలో పడింది
                          నిజమా కలా తెలిసేదెలా
|ఆమె|
       నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
                          దాచేదెలా లోలోపల
|అతడు|
       మనకిద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది
       అందుకే ఇంతలా గుండె ఉలికిపడుతు ఉంది
                     ||నా మనసుకేమయింది||
.
||చ|| |అతడు|
       చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమా
       కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
|ఆమె|
       జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
       అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
|అతడు|
       పంచుకున్న ముద్దులో ఇలా జతే పడీ
|ఆమె|
       పెంచుకున్న మత్తులో మరీ మతే చెడీ
|అతడు|
       గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదనీ
                        ||నా మనసుకేమయింది||
.
||చ|| |ఆమె|
       ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా
       ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
|అతడు|
       ఒంటిగా ఉండనివ్వదు కళ్లలో ఉన్న నీ రూపు రేఖ
       ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగా
|ఆమె|
       లోకమంటే ఇద్దరే అదే మనం అనీ
|అతడు|
       స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అనీ
|ఆమె|
       వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథనీ
                        ||నా మనసుకేమయింది||
                        || మనకిద్దరికీ తెలియంది||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)