|
Context
Song Context:
Indian American boy welcoming ఇండియా కుమారి to the west!
[వెల్ కం ఇండియా కుమారి - ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి] |
Song Lyrics
||ప|| |అతడు|
వెల్ కం ఇండియా కుమారి వొణుకుడు దేనికే వయారి
వేషం మార్చుకోవె పోరి - ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి
వెస్ట్రన్ స్తైలులో న్యూ స్మైలులో దొరసాని లాగమారి
ఆమె:
అరెరె ఆగు ఒక్కసారి పరుగులు తీయలేను సారీ
అసలే కొత్తగుంది దారి పడతానేమో కాలుజారి
మనుషుల లోకమో మాలోకమో ఈ మాయదారి మజిలీ
|| వెల్ కం ||
.
||చ|| |అతడు|
కార్లో శృంగారం అదేమంత నేరం
బేజారవుతావేం అది ఈ ఊళ్ళో ఆచారం
ఆమె:
ఏంటి వ్యవహారం మరీ ఇంత ఘోరం
బాగుందంటావేం నడివీధుల్లో వికారం
అతడు:
Be a Roman when you are in Rome
ఆమె:
అయ్యో రామా ఇదేం సంబరం
అతడు:
నలుగుర్లాగే ఉండాలే మనం
ఆమె:
నడిచే దెట్టా నీతో కాపురం
అతడు:
ఎట్టాగో అట్టా అడ్జస్టు అయిపోవే భామా
|| వెల్ కం ||
.
||చ|| |ఆమె|
వస్త్రాలేం కరువా అవేమంత బరువా
చెడ్డీలే కట్టి చెడ తిరిగాడే అది పరువా
అతడు:
చాదస్తం మగువా ప్రతీ చోట తగువా
పరేషాను మాని ఆరే! పరవాలేదనుకోవా
ఆమె:
ఊరంతా చూడాలి అందుకా - ఒళ్ళంతా వదిలేయమందువా
అతడు:
MTV FTV చూడవా బ్యూటి పోటీ మాటలెరగవా
ఆమె:
అట్టాగ నన్నుండ మంటావా ఏంటయ్య మామా
|| వెల్ కం ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)