Posted by admin on 5th February 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
కోరి కోరి కాలుతుంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
||కోరి కోరి||
.
చరణం: అతడు:
కాగుతున్న కోరికంత కాగడాగ మారని
ఆమె:
కంటపడని కైపుకథల సంగతేదొ చూడని
అతడు:
కౌగిలిలో నలిపి నలిపి చుక్కలనోడించని
ఆమె:
రాలుతున్న మల్లెలు గా పక్కపైన దించని
అతడు:
గాజుల గలగలలు విరజాజుల విలవిలలు
ఆమె:
కందిపోయి కాలమాగని
||కోరి కోరి||
.
చరణం: ఆమె:
కునుకేదో కనపడదే ఏమైందో ఏమో
అతడు:
లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో
ఆమె:
కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపొయిందో
అతడు:
జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో
ఆమె:
ఊపిరి ఉప్పెనలో తొలిమత్తుల నిప్పులలో
అతడు:
చందమామ నిదర చెదరని
||కోరి కోరి||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)