Posted by admin on 26th February 2010 in
ప్రేమ
|
Context
Song Context:
ఓ యుగళ గీతం |
Song Lyrics
||ప|| |అతడు|
ఏదో తహతహతో ఈ రాత్రి మేలుకుంది
ఎంతో తమకముతో నీ జంట కోరుకుంది
అందుకే ముద్దిమ్మని అంతగా అడిగా మరి
ఊరికే ఊరించకే ఉహు అని
|ఆమె|
నీతో ఈ సమయం సరదాగ గడపమంది
నాలో కాస్త భయం బిడియంగా ఆపుతోంది
ఎందుకో ఏమో మరి వయసులో ఈ ఆవిరి
ఎప్పుడూ ఇదివరకు లేదు ఈ అల్లరి
||ఏదో తహతహతో||
.
||చ|| |అతడు|
మరీ కొంచెం ఇలా వస్తే సతాయించే చలెంతుందో తెలుస్తుంది
|ఆమె|
సరే అంటూ సమీపిస్తే మతేపోయే మత్తు నన్ను మెలేస్తుంది
|అతడు|
అదిరిపడే పెదాలను ఆపొద్దా
|ఆమె|
ఆశపడే ముహూర్తం కుదరొద్దా
|అతడు|
సాయందనా చేయందుకొని సై అంటే సరిపోదా
|| నీతో ఈ సమయం ||
.
||చ|| |ఆమె|
తినేసేలా అలా చూస్తే మనస్సంతా మహా ఇదిగా బెదురుతోంది
|అతడు|
అయ్యో పాపం అనకపోతే చిలిపి తాపం చిరెత్తించి చంపుతోంది
|ఆమె|
అవుననుకో అలాగని తెగబడనా
|అతడు|
అనుకుంటే అదేం మహ కాని పనా
|ఆమె|
నా వెంటపడి ఏం చేతబడి చేశావో మరి హా
||ఏదో తహతహతో||
|| నీతో ఈ సమయం ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)