Posted by admin on 5th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |అతడు|
పొరపాటిదీ తడబాటిదీ గుంజీళ్ళే తీసేయనా ||2||
ఏదో పాపం పసివాడ్నీ జాలీ చూపి వదలండీ మన్నించండీ
|ఆమె|
అతి తెలివితో మతి పోయెనా నీ వేషం నా ముందరా ||2||
.
||చ|| |ఆమె|
వలను కొరికే చేప నేను
ఎరను చూసీ మోస పోను
వెకిలి వేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా
యముడిలా వాడు వెనక ఉన్నాడు తెలుసునా తెలియజెప్పనా
|అతడు|
వద్దు వద్దు బాబోయ్ తప్పు కాయి తల్లోయ్
చెంప లేసుకుంటా గోడకుర్చి వేస్తా
మొన్ననే నేను కళ్ళు తెరిచాను ఇంతలో నన్ను బూచాడికిచ్చేయ్‌కు
|ఆమె|
అతి తెలివితో మతి పోయెనా నీ వేషం నా ముందరా ||2||
పోనీ పాపం అనుకుంటే చనువే ముదిరిందే మరియాదేనా
||పొరపాటిదీ||
.
||చ|| |అతడు|
విలువ తెలిసే వెతికి చేరా
బతుకు నీతో ముడిని వేసా
దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా
మనసులో మాట తెలుసుకోవమ్మ చెలిమితో కలిమి కురియవా
|ఆమె|
చిన్నవాడ నిన్ను నమ్ముతాను లేవోయ్
అల్లరెందుకింక పల్లకీని తేవోయ్
కోతి వేషాలు మానితే చాలు నిన్ను వెన్నంటి ఉంటాను ఏనాడు
||పొరపాటిదీ||
.
.
(Contributed by Venu) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)