Posted by admin on 19th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |అతడు|
నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా
|ఆమె| ఒక క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా
|అతడు| ఏం చేద్దాం |ఆమె| జత పడదాం
|అతడు| ఈ దూరం |ఆమె| పని పడదాం
|అతడు| ఆనందం |ఆమె| కనిపెడదాం
|అతడు| నువ్వు సరేనంటే సరిహద్దే తెంచుకుందాం
||నరనరం||
.
||చ|| |అతడు|
లేత పెదవి తడి తగిలీ నేను కరిగిపోవాలి
|ఆమె|
వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి
|అతడు|
ఏమన్నదో నీ ఊపిరి
|ఆమె|
ఏం విన్నదో నీ తిమ్మిరి
|అతడు|
ఎందుకటా అరచేతుల్లో ఈ చెమట
|ఆమె|
కొత్త కదా సరసం కోరే నీ సరదా
|అతడు|
మొదలయే నిప్పు ముదిరితే ముప్పు కాదా
||నరనరం||
.
||చ|| |ఆమె|
కైపు కళ్ల గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు
|అతడు|
చీకటల్లే నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ
|ఆమె| ఆపేదెలా నీ అల్లరి
|అతడు| ఆర్పేదెలా ఈ ఆవిరీ
|ఆమె| ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా
|అతడు| చనువిస్తే ఇక నీ వెనకే పడిచస్తా
|ఆమె| అడగాలా చెప్పు మొగమాటం తప్పు కాదా
|| నరనరం ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)