|
Context
Song Context:
నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి!
చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి! |
Song Lyrics
||ప|| |అతడు|
తళతళమని కులుకులవని కనపడుతుంటే మతి పోదా కుమారి
|ఆమె|
పదపదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు ఉందో నీ దారి
|అతడు|
నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
|ఆమె|
చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి
|| తళతళమని ||
.
||చ|| |ఆమె|
లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగనీ
|అతడు|
పైకేం వినలేని రాగం మనలోని మౌనం కరిగించనీ
|ఆమె|
ఇంతకాలం బరువైన ప్రాయం అణిగే సహాయం ఒడి చేరనీ
|అతడు|
పాపం ప్రియురాలి తాపం అణిగే ప్రతాపం చూపించనీ
|ఆమె|
కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఏం కావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వాలి
|అతడు|
జంటకు చేరిన ఒంటరి ఒంపులు తుంటరి ఆశలు తీరాలి
నమ్ముకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో
||పదపదమని||
|| తళతళమని ||
.
||చ|| |అతడు|
లోలో రుసరుసలు రేపే తహతహలు ఆపే సమయం ఇదీ
|ఆమె|
నాలో గుసగుసలు నీతో పదనిసలు పాడే వరసే ఇదీ
|అతడు|
అందుకోనీ తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలనీ
|ఆమె|
కానీ నిలువెల్ల నాటే కొనగోరు మీటే కొంటె ఆటనీ
|అతడు|
ముద్దులు పెట్టక నిద్దరపట్టక బిత్తరపోయిన కోమలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
|ఆమె|
ఇప్పటికిప్పుడు చెప్పక చెప్పిన తప్పని తప్పులు చెయ్యాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సద్దుకుపోవాలి
||తళతళమని ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)