Posts Tagged ‘2009’

శశిరేఖా పరిణయం : ఏదో ఒప్పుకోనంది నాప్రాణం

Posted by admin on 12th February 2009 in మానసిక ఘర్షణ
Audio Song 1:
Audio Song 3:
 
Video Song(1):
Video Song(2):
Video Song(3):
 
Movie Name
   Sasirekha parinayam
Singers
   Saindhavi
Music Director
   Vidya Sagar
Year Released
   2009
Actors
   Genelia
Director
   Krishna Vamsi
Producer
   Madhu Murali

Song (1) Lyrics

Context: A girl talks to herself when imposed with something against her will
||ప|| |ఆమె|
       ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
       అది ఏదో చెప్పలేనంది ఈవైనం
       కలత పడుతోందే లోలోన
       కసురుకుంటోందే నాపైన
       తన గుబులు నేనో
       నా దిగులు తానో
       కొంచెమైన పంచుకుంటే తీరిపోతుందేమొ భారం
                                        ||ఎదో ఏదో||
.
||చ||
       పచ్చగా వున్నా పూదోట నచ్చడం లేదే ఈపూట
       మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా
                                             ||పచ్చగ||
       ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా
                                             ||ఉండలేను||
       తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకుపోదాం
       తక్షణం అంటూ పట్టుపడుతోంది ఆరాటం
       పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం

Song (2) Lyrics

Context: A girl questions herself if she is in love with him
||చ|| |ఆమె|
       అందరూ నడిచే దారైనా అడవిలో మారిందనుకోనా
       నేస్తమై వచ్చే నీడైనా నిందలేస్తుందే నాపైనా
                                          ||అందరూ||
       కంటపడని శత్రువులా సొంత మనసు ఎందుకిలా
                                          ||కంట||
       కక్ష గడుతూ రెచ్చ గొడుతూ ఇంత వేదించే గాయం
       ఏమిటో ఏమో తేల్చుకోలేని అనుమానం
       తెలుసేమో బయట పడలేని అభిమానం
.
||ప||
       ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
       అది ఏదో చెప్పలేనంది ఈవైనం
       కలత పడుతోందే లోలోన
       కసురుకుంటోందే నాపైన
       తన గుబులు నేనో
       నా దిగులు తానో
       కొంచెమైన పంచుకుంటే తీరిపోతుందేమొ భారం
                                    ||ఎదో ఏదో||

Song (3) Lyrics

Context: A girl debates with herself after she is in love with him
||ప|| |ఆమె|
       ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
       అది ఏదో చెప్పనంటోంది నామౌనం
       ఉబికివస్తుంటె సంతోషం
       అదిమిపెడుతోందే ఉక్రోషం
       తనవెనుక నేనో నా వెనుక తానో
       ఎంతవరకి దాని పయనం
       అడగదే ఉరికే ఈవేగం
                          ||ఎదో ఏదో||
.
||చ||
       ముల్లులా బుగ్గను చిదిమిందా
       మెల్లగా సిగ్గును కదిపిందా
       వానలా మనసును తడిపిందా
       వీణలా తనువును తడిమిందా
                             ||ముల్లు||
       చిలిపి కబురు ఏంవిందో
       వయసుకేమి తెలిసిందో
                             ||చిలిపి||
       ఆదమరుపొ ఆటవిడుపో కొద్దిగా నిలబడిచూద్దాం
       ఓక్షణం అంటే కుదరదంటోంది నాప్రాయం
       కాదంటే ఎదురు తిరిగింది నాహృదయం

Highlights (1, 2 & 3)

The same పల్లవి in three totally different contexts? Is it the first time it happened? Brilliant!
I changed the formatting of the page to accommodate all three versions in the same screen shot.
Observe the difference in the second sentence of పల్లవి: 1&2) చెప్పలేనంది ఈవైనం
3) చెప్పనంటోంది నామౌనం.
1) తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకుపోదాం…. Wow!
2) కక్ష గడుతూ రెచ్చ గొడుతూ ఇంత వేదించే గాయం
3) What a great concept “ఉరికే ఈవేగం”?
[You can also refer to "పొద్దులెరుగని పరుగై"]
.
Observe the debate between ప్రాయం and హృదయం.
హృదయం said ఆదమరుపొ ఆటవిడుపో… stop this వేగం and నిలబడిచూద్దాం. But the ప్రాయం said no way!

………………………………………………………………………………………………………………………………………………….