Archive for the ‘తెలుగింటి పెళ్ళి’ Category

మురారి: అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి

Posted by admin on 13th March 2009 in తెలుగింటి పెళ్ళి

Audio Song:
 
Video: Birth of the Song:
 
Video Song:
 
Movie Name
   Murari
Singers
   Jikki, Suneetha, Sandhya
Music Director
   Mani Sharma
Year Released
   2001
Actors
   Mahesh Babu, Sonali Bendre
Director
   Krishna Vamsi
Producer
   Nandigam Devi Prasad

Context

Song Context: ఓ తెలుగు అబ్బాయి, ఓ తెలుగు అమ్మాయి కి పెళ్ళి అయ్యింది … ఇలా

Song Lyrics

||ప||
       ఆ… ఆ… ఆ… ఆ…
       అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
       అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి ||అలనాటి||
       అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
       ఆ… ఆ… ఆ… ఆ…
       తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన
       శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ ||తెలుగింటి||
       అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
       ఆ… ఆ… ఆ… ఆ…
||ఖోరస్||
       చందమామ చందమామ కిందికి చూడమ్మా
       ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
       వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
       మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
.
||చ||
       పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
       పచ్చని మెడపై వెచ్చగ వ్రాసెను చిలిపి రహస్యాలు
       నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
       ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు
       అందాల జంట అందరికంటికి విందులు చేసే సమయాన
       ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
       అందాల జంట అందరికంటికి విందులు చేసే సమయాన
       కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
       తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి 
                                                ||చందమామ||
.
||చ||
       సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
       విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
       గౌరిశంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా
       మరగ లేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
       దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
       ఆ… ఆ… ఆ… ఆ…
       దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
       అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
       తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
                                                ||చందమామ||

Highlights

First the idea of this song straight from the horse’s mouth (i.e., Krishna Vamsi) in the video on the left.
.
A few key aspects of this song:
1) It is probably easy to write a wedding song on “the Gods”. However Sirivennela’s  speciality is his lead characters are always “humans”!
2) Absolutely no emotional and abstract concepts in this song (for example compare the anologies in this song with those from “ఇంద్ర: ఘల్లు ఘల్లు,” and “ఇంద్ర: భంభం బోలే,” of “Indra” movie songs). Here Sirivennela stays on the ground, rock solid, (i.e. at the reality level) and pulls out anologies from his “kitty” of patentable expressions born out of lifelong real experiences coupled with his inimitable imagination to knit a song like this!
3) The groom is as good as రామచంద్రుడు, and way better than బాలచంద్రుడు. లక్ష్మీ దేవి was born in పాలసంద్రం. This bride is తెలుగింటి లక్ష్మి and she is going to end up in శ్రీహరి ఇంట్లో !
4) “పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
     పచ్చని మెడపై వెచ్చగ వ్రాసెను చిలిపి రహస్యాలు
     నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
     ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు”
Absolutely realistic and stunning expessions!
5) “దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా” nails the human concept firmly however the “అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి” lets the opposing camp also, perhaps, go to bed peacefully! :)
6) Finally Don’t miss the humor! “తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి” [Don’t ask about శోభనం and thanks for coming! That is your way out! See you folks later!]
.
You also made every telugu couple proud of themselves!
.
Needless to say, this song will live as long as telugu language lives, if not longer!
[Also refer to Pages 25-26 in కల్యాణ రాగాలు]
……………………………………………………………………………………………….