Archive for the ‘ఆనందలహరి’ Category

ఇంద్ర: భంభం బోలే శంఖం మోగెలే ఢంఢం ఢోలె చెలరేగిందిలే

Posted by admin on 6th March 2009 in ఆనందలహరి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Indra
Singers
   Shankar Mahadevan, Hariharan
Music Director
   Mani Sharma
Year Released
   2002
Actors
   Chiranjeevi
Director
   B. Gopal
Producer
   C. Ashwani Dutt

Context

Song Context: Hail శివానందలహరి!
                        Hail కాశీ!
                        Hail గంగ!
              Keep hailing & singing “పొద్దులెరుగని పరుగై”!

Song Lyrics

||ప|| |అతడు|
       భంభం బోలే శంఖం మోగెలే ఢంఢం ఢోలె చెలరేగిందిలే (2)
       తధినకధిం దరువై సందడి రేగనీ
       పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ (2)
       విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి
       విశాలాక్షి సమేతంగాచేరీ వరాలిచ్చె కాశీ పురీ….. ||భంభం||
.
కోరస్:
       భంభం బోలే భంభం బోలే భంభం బోలే భొలేనాథ్ (2)
       బోలే నాచే చం చమా చం (2)
       డమరు బాజే (3) డం డమా డం
       బోలే నాచే చం చమాచం (2)
.
||చ||
       వారణాశిని వర్ణించే నా గీతికా
       నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
       ముక్తికే మార్గం చూపె మణికర్లికా
       అల్లదే అంది నా ఈ చిరు ఘంటికా
       నమక చమకాలై యదలయలే కీర్తన చేయగా
       యమక గమకాలై పదగతులే నర్తన చేయగా
       ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా ||విలాసంగా||
.
కోరస్:
|ఆమె| కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
         ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా
|అతడు| ధం ధమా ధం |ఆమె| ధమాధం ధమాధం (2)
|అతడు| ధం ధమా ధం (4) ధంధంధం
.
||చ||
       ఎదురయ్యె శిల యేదైనా శివలింగమే
       మన్ను కాదు మహాదేవుని వరదానమే
       చిరంజీవిగా నిలచింది ఈ నగరమే
       చరితలకు అందనిది ఈ కైలాసమే
       గాలిలో నిత్యం వినలెదా ఆ ఓం కారమే
       గంగలో నిత్యం కనలెదా శివకారుణ్యమే
       తరలిరండీ తెలుసికొండి కాశిమహిమా |విలాసంగా|
                                                        |భం భం|

Highlights

A Song of Pure Happiness! Absolute Joy! శివానందలహరి!
విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి
 విశాలాక్షి సమేతంగాచేరీ వరాలిచ్చె కాశీ పురీ…..

.
Full of emotional concepts effortlessly tied to analogous logical concepts!
Vintage Sirivennela on song in full flight!
It is effortlessly caressed off the toes to the fine leg boundary :)
.
You can visit కాశీ without leaving your chair! Is there any better way of hailing “వారణాశి”?
Are there other poetry works like this on వారణాశి in any language, in any age? I am sure there will be. Knowledgeable folks please reply with pointers. Let us compare!
I love the concept “పొద్దులెరుగని పరుగై”. “Running happily all the time forever”!
[You can also refer to "ఉరికే ఈవేగం"]
.
This kind of poetry you can analyze in a full length chapter of a book!
I cannot leave out any line… just because I want to bring to your attention, I am quoting a few:
1) “నమక చమకాలై యదలయలే కీర్తన చేయగా
     యమక గమకాలై పదగతులే నర్తన చేయగా
     ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా”

2) “గాలిలో నిత్యం వినలెదా ఆ ఓం కారమే
     గంగలో నిత్యం కనలెదా శివకారుణ్యమే
     తరలిరండీ తెలుసికొండి కాశిమహిమా”
……………………………………………………………………………………………
Also Look at the song on ఆశా సుగంధం from the same movie ఘల్లు ఘల్లు, (Two Masterpieces from the pen of Sirivennela)