Movie Name Yamaleela Singers S.P. Balu, Chitra, chorus Music Director S.V Krishna Reddy Year Released 1994 Actors Satyanaryana, Ali, Indraja Director S.V Krishna Reddy Producer K. Achchi reddy
Context
Song Context: యముడు మరియు ఒక మానవ కన్య మద్య: ఓ యుగళ గీతం!
Song Lyrics
||ఖోరస్||
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||2||
||సాకీ| |యముడు|
ధర్మపరిరక్షణా ధురంధరుండా
సకలపాప శిక్షణా దక్షుండా
చండతర దండతర బాహుమండిత నిగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా… హహ్… యముండా
.
||ప|| |ఆమె|
అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ
||ఖోరస్||
ఆఆ.. ఆఆ.. ఆఆఆఆఆఆఆ…
.
|యముడు|
ఏమీ శహబాస్…
శహబాసులే నర నారీమణీ బహుబాగులే సుకుమారీమణీ
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ.. ఆఆ..
||ఖోరస్||
ఆఆ.. ఆఆ.. ఆఆఆఆఆఆఆ…
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||3|
.
||చ|| |ఆమె|
సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
||ఖోరస్||
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||2||
.
|యముడు|
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
|ఆమె|
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్… ఆఆ..
||ఖోరస్||
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||2||
.
|యముడు|
అవశ్యము.. అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం… ఆఆ..
||ఖోరస్||
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||2||
.
||చ|| |యముడు|
ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
||ఖోరస్||
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||2||
|ఆమె|
నరలోకమున ఊరి కొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
|యముడు|
ఊరించకే ఇక నా రాజహంస
|ఆమె|
యమ హాయి నీదేలే రసికావతంస… ఆఆ..
||ఖోరస్||
ఆఆ.. ఆఆ.. ఆఆఆఆఆఆఆ…
.
|యముడు|
రసికాగ్రేసరుండా…యముండా
|ఆమె|
మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రాదేవరా… ఆఆ..
||ఖోరస్||
ఆఆ.. ఆఆ.. ఆఆఆఆఆఆఆ…
.
|యముడు|
మజ్జారే మదవతీ…
శహబాసులే నర నారీమణీ బహుబాగులే సుకుమారీమణీ..
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ… ఆఆ..
||ఖోరస్||
ఆఆ.. ఆఆ.. ఆఆఆఆఆఆఆ…
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తతధుం ||2||
||ధర్మపరిరక్షణా||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world