Archive for March 13th, 2009

మురారి: ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక

Posted by admin on 13th March 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Murari
Singers
   S.P. Charan, Harini
Music Director
   Mani Sharma
Year Released
   2001
Actors
   Mahesh Babu, Sonali Bendre
Director
   Krishna Vamsi
Producer
   Nandigam Devi Prasad

Context

Song Context: A Romantic song between a boy and a girl in love

Song Lyrics

||ప|| |అతడు|
       ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
       నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
|ఆమె|
       తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
       ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
|అతడు|
       నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో
|ఆమె|
       పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నది
|అతడు|
       ఏ వూరే అందమా ఆచూకీ అందుమా
|ఆమె|
       కవ్వించే చంద్రమా దొబూచీ చాలమ్మా ||ఎక్కడ||
.
||చ|| |అతడు|
       కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులూ
       పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలుకలూ
|ఆమె|
       పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులూ
       పరుగులో ఆ అడుగులు గోదారిలో వరదలు
|అతడు|
       నా గుండెలో అదోమాదిరి నింపెయ్యకే సుధామధురి
|ఆమె|
       నా కళ్ళలో కళల పందిరి అల్లెయ్యకోయా మహాపోకిరి
|అతడు|
       మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ
|ఆమె|
       సిగ్గల్లె తాకిందీ బుగ్గల్లో దాగుందీ |తుంటరి||
.
||చ|| |ఆమె|
       ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
       అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
|అతడు|
       మెరుపునీ తొలిచినుకునీ కలగలిపి చూడాలని
       ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియని
|ఆమె|
       ఎన్నాళ్ళిలా తనొస్తాడనీ చుడాలట ప్రతీదారిని
|అతడు|
       ఏతోటలో తనుందోనని ఎటు పంపనూ నా మనసునీ
|ఆమె|
       ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
|అతడు|
       అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా ||తుంటరి||
|పాప|
       అక్కడ అక్కడ అక్కడ ఉందా తారక
       అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగక

Highlights

Brilliant lyrics to depict the physical distance, losing oneself somewhere in the dreams and the imaginative expressions
………………………………………………………………………………………………..