Movie Name
Vaasu Singers Raghavendra, Chitra Music Director
Haris Jairaj Year Released 2002 Actors
Venkatesh,
Bhoomika Chawla Director Karunakaran Producer K. S. Rama Rao
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
నమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి || నమ్మవే ||
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను నన్ను మరిచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతోంది చిలిపిగానే || నమ్మవే ||
.
||చ|| |ఆమె|
ఓసారి చెయ్యేస్తే ఎలా కళ్లు మూసి ఒళ్లు మరిచిపోతే
|అతడు|
నువ్వు గనక నేనైతే నువ్వే చెప్పగలను ఏమి జరిగెనంటే
|ఆమె|
ఇలాగ వేలు తాకి అలాగ సోలిపోతే
నువ్వేమిటవుదువో మరింత ముందుకొస్తే
|అతడు|
తుఫాను కాక ముందు చిటుక్కు చినుకు ముద్దు
ఇలాగే మన గుండెలోన ఆవిర్లు రేపిపోదా
నమ్మవే అమ్మాయి…
|ఆమె|
చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంత గడపకోయి
ఇంత కన్న హాయి కావాలా ఆకతాయి
అందించగలను చేతిలోన చేయి వేయి
.
||చ|| |అతడు|
ఇన్నాళ్లు ఈ గాలి ఇలా పాడలేదు ఇంత చిలిపి లాలి
|ఆమె|
ఇంకేమి కావాలి సరే వెళ్లు కలలలోకి తేలి తేలి
|అతడు|
ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కందిపోవు నేను
|ఆమె|
మరైతె ఇంక నేను ఎలాగ తట్టుకోను
నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైన తాకవేమో
చాలులే బడాయి
|అతడు|
నమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను నన్ను మరిచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతోంది చిలిపిగానే
|| నమ్మవే || |అతడు|
|ఆమె|
లేనిపోని మైకమింక మానుకో
చేరువైన నన్ను కాస్త చేరుకో
లేకపోతే కోపమొచ్చి మాయమవుతా చూసుకోరా
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world