Archive for May 22nd, 2009

కొత్త బంగారు లోకం: నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

Posted by admin on 22nd May 2009 in బతుకుంటే బడి చదువా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kotha Bangaru Lokam
Singers
   S.P. Balu
Music Director
   Mickey J. Meyer
Year Released
   2008
Actors
   Varun Sandesh,
   Swetha Prasad
Director
   Sreekanth Addala
Producer
   Dil Raju

Context

Song Context:
A situational song when the (teenage) lovers try to run away aimlessly

Song Lyrics

||ప|| |అతడు|
       నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
       నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
       ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
       ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
       పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
       అపుడో ఇపుడో కననే కనను అంటుందా
       ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
       గుడికో జడకో సాగనంపక ఉంటుందా
       బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
       పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
       ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
.
||చ|| |అతడు|
       అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
       కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
       గతముందని గమనించని నడిరేయికి రేపుందా
       గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
       వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
       గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
       సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేవా
.
||చ|| |అతడు|
       పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
       ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
       మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
       కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
       కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
       అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
       తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
       ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత     || పది నెలలు ||
.
.
                           (Contributed by Nagarjuna)

Highlights

“The nature does its thing. (Ex: పది నెలలు తనలో… & ప్రతి కుసుమం … )
Everybody has their own problems.
Your problems & issues are yours, Only you have to solve them!
బతుకుంటే బడి చదువా? అనుకుంటే అతి సులువా?
You cannot get back the time, you wasted!”
.
Focus on these lines, just to quote a few:
“అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
[Is there an ocean with no waves? Asking this type of stupid questions is not cleverness!]
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
[You don't sleep all day everyday so you won't get any dreams!]
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
[planning is important!]
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
[Just by going aimlessly you cannot reach your destination!]
.
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత
[You do not give up thinking that this is the destiny, when you are fighting for it. If you do, then you are not really fighting for it!]
.
Absolutely amazing lyrics! [This song is the concluding message (highlight) of the whole movie: sub-teenage love].
Thank you very much, Poet Sir.
………………………………………………………………………………………………..