Movie Name
Okariki Okaru Singers M.M. Keeravani Music Director
M.M. Keeravani Year Released 2004 Actors
SriRam, Aarthi Chabria Director Rasool Ellore Producer Kiran
Context
Song Context: A Romantic Song
Song Lyrics
||ప|| |అతడు|
వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా
అయినా..ఎందుకనే ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా
.
||చ|| |అతడు|
ఆమె వలలో చిక్కుకుందా సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేనిప్పుడెక్కడున్నానంటే నాక్కూడా అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే నాకేదో మత్తు కమ్మినట్టే
రమ్మంది గాలి నను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది తీపి చెలిదారి చినుకు వంతెనేసి
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే…..
.
||చ|| |అతడు|
తాను కూడా రాకపోతే నాతో
నేను కూడా ఆగిపోనా తనతో
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తననంటే
కళ్ళారా చూశానంటూ ఉంటే
ఎలా నమ్మేది స్వప్నమంటే
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే…..
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world