Archive for May 9th, 2009

కిక్: గోరే గోరే గొ గోరే గోరే గోరే గోరే గొ గోరే

Posted by admin on 9th May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Kick
Singers
   Karthik, Jyotsna
Music Director
   Thaman S.
Year Released
   2009
Actors
   Ravi Teja, Ileana
Director
   Surender Reddy
Producer
   Venkat

Context

Song Context: A love song

Song Lyrics

||ప|| |ఆమె|
       పో పో పొమ్మంటోందా
       నన్ను రా రా రమ్మంటోందా
       నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా ||2||
|అతడు|
       చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
       ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీ వల్ల
       ఇదనా అదనా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
       గోరే గోరే గొ గోరే గోరే గోరే గోరే గొ గోరే || 2||
.
||చ|| |అతడు|
       తెగ ఉరుముతు కలకాలం
       తెరమరుగున తన భారం
       మోసుకుంటూ తిరగదు మేఘం
       నీలా దాచుకోదుగా అనురాగం ||2||
|ఆమె|
       ముళ్లుగా నాటితే నీ వ్యవహారం
       తుళ్లిపడదా నా సుకుమారం
       మెల్లగ మీటితే నాలో మారం
       పలికుండేదే మమకారం
       అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా
       గోరే గోరే..గోరే గొ గోరే…
.
||చ|| |అతడు|
       వెంటపడుతుంటే వెర్రి కోపం
       నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
       మండిపడుతుందే హృదయం
       మరిచే మంత్రమైన చెప్పదే సమయం ||2||
|అతడు|
       నీతో నీకే నిత్యం యుద్ధం
       ఎందుకు చెప్పవే సత్యభామా
       ఏం సాధిస్తుందే నీ పంతం
       ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమ
       తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా
                                 || గోరే..గోరే||
.
.
          (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….