|
Context
Song Context:
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు ఛాప్టరు |
Song Lyrics
||ప|| |అతడు|
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ || భద్రం బీ కేర్ఫుల్ ||
ఆలికి మెళ్లొ ముళ్లేశానని ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలొచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు ఛాప్టరు
||భద్రం బీ కేర్ఫుల్||
.
||చ|| |అతడు|
వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్లాచారం
జంటలు కట్టే జంతువులెరగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం
||భద్రం బీ కేర్ఫుల్||
.
||చ|| |అతడు|
చచ్చి చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు
||భద్రం బీ కేర్ఫుల్||
.
||చ|| |అతడు|
పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
పర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా
ఈది అమీను, సదాం హుస్సేను, హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో వున్నా పెళ్ళం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా
||భద్రం బీ కేర్ఫుల్||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A popular song with tickling lyrics!
.
[Also refer to Page 199 of సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………
|
|
6 Comments »