Posted by admin on 18th December 2009 in
భారతదేశం
|
Context
Song Context:
భారతదేశం! [India]
(అది నా భారతదేశం - అది నా హృదయనివాసం
అది నా ఆశల విలాసం - నా ఆశయాలకది వికాసం) |
Song Lyrics
||ప|| |అతడు|
చల్లని శాంతుల దరహాసం శాశ్వత విలువల స్థిరవాసం
మంచీ మమతల మధుకోశం యుగాలు చదివిన ఇతిహాసం
అది నా భారతదేశం - అది నా హృదయనివాసం
అది నా ఆశల విలాసం - నా ఆశయాలకది వికాసం
అతడు2:
చెప్పకు చెప్పకు గొప్ప నువ్వొక నూతిలో కప్ప
|కోరస్| ||చెప్పకు చెప్పకు||
అప్పులు తప్ప చిప్పలు తప్ప ఇండియాలో ఏమున్నదిరబ్బా
ఆమె:
ఎల్లలు దాటితే చిల్లుకానికి చెల్లని రూపాయి
గ్లోబును మొత్తం కొనగల డాలరు ముందా బడాయి
.
||చ|| |అతడు2|
మట్టిలోన పారాడే తత్వం మానేయబ్బాయి
స్టేట్స్ దాకా పెరిగే స్టేటస్సేం తక్కువ కాదోయి
కోరస్:
ఇక్కడకొచ్చేయ్ ఇక్కడే సెటిలైపోవోయి || 2 ||
ఆమె:
కష్టాలు కన్నీళ్ళూ కూడు గూడు లేనివాళ్ళు
ఇరుకుతనం పిరికితం మురికితనం వదలని వాళ్ళు
ఇదే కదా న్యూ ఇండియా ఇంతకుమించేముందయ్యా
|కోరస్| || ఇదే ||
అరచేతిలో వైకుంఠం అంటే అమెరికాని చూడండయ్యా
కోరస్:
ఈ అమెరికాను చూడండయ్యా
.
||చ|| |అతడు|
కష్టాలొస్తే కలిసిపంచుకొను ఆత్మీయతలున్నాయి అక్కడ
కన్నీళ్ళొస్తే అవి తనకిమ్మని అడిగే ఎదలున్నాయి అక్కడ
సుఖాలు మాత్రమే చుట్టాలనుకొను సంపదలున్నాయి ఇక్కడ
అంతేనయ్యా తేడా ఎంతోనయ్యా
|కోరస్| || అంతే ||
అతడు2:
పిట్టలుకూడా వలస వెళ్ళవా వసతి చాలకుంటే
అతడు:
పిట్టలతో సరిపోల్చుకోడమా మనిషి తెలివి అంటే
అతడు2:
మెదడుండే ప్రతివారు ఇంకా ఎదగాలని చూస్తారు
అతడు:
మెదడు పెరిగి మనసు తగ్గిస్తే యంత్రాలైపోతారు
అతడు2:
భగవద్గీతలు భాగవతాలు చాలోయ్ బాబూజీ
కొరస్:
ఇది కంప్యూటర్ ఏజి
ఆమె:
తాతలు తాగిన నేతుల వాసన చూపుతూ ఎందుకు పేచీ
కొరస్:
ఇది ఇంటర్నెట్ స్టేజి
.
||చ|| |అతడు2|
ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే సంపాదించే అవకాశం
కావలన్న అందరికి అందదు ఈ అదృష్టం
ఇక్కడకొచ్చేయి ఇక్కడే సెటిలైపోవోయి
|కోరస్| || ఇక్కడ ||
.
అతడు:
అనుబంధాలు అనురాగాలే అదృష్టంగా భావిద్దాం
ఎండమావులనే వెంటాడే ఈ అవివేకాన్నే వదిలేద్దాం
ఎక్కడవున్న మనిషిగా నిలిపే మనసు పెంచుకుందాం
ఎవరికివారే యమునా తీరే తెలివి మరిచిపోదాం
దేశాలు జాతులనే ఈ ఎల్లలు చెరిపేద్దాం
సంపదకన్నా శాంతి మిన్నా అని నమ్మినదేగా మానవత
నమ్మినదేగా మానవత
.
.
(Contributed by Pradeep) |
Highlights
చల్లని శాంతుల దరహాసం శాశ్వత విలువల స్థిరవాసం
మంచీ మమతల మధుకోశం యుగాలు చదివిన ఇతిహాసం
అది నా భారతదేశం - అది నా హృదయనివాసం
అది నా ఆశల విలాసం - నా ఆశయాలకది వికాసం
.
కష్టాలొస్తే కలిసిపంచుకొను ఆత్మీయతలున్నాయి అక్కడ
కన్నీళ్ళొస్తే అవి తనకిమ్మని అడిగే ఎదలున్నాయి అక్కడ
సుఖాలు మాత్రమే చుట్టాలనుకొను సంపదలున్నాయి ఇక్కడ
అంతేనయ్యా తేడా ఎంతోనయ్యా!
.
అనుబంధాలు అనురాగాలే అదృష్టంగా భావిద్దాం
ఎండమావులనే వెంటాడే ఈ అవివేకాన్నే వదిలేద్దాం
ఎక్కడవున్న మనిషిగా నిలిపే మనసు పెంచుకుందాం
ఎవరికివారే యమునా తీరే తెలివి మరిచిపోదాం
దేశాలు జాతులనే ఈ ఎల్లలు చెరిపేద్దాం
సంపదకన్నా శాంతి మిన్నా అని నమ్మినదేగా మానవత
నమ్మినదేగా మానవత!
……………………………………………………………………………………………… |
|
No Comments »