Movie Name
Maharshi Singers S.P. Balu Music Director
Ilaya Raja Year Released 1987 Actors
Raghava, Shanti Priya Director Vamsi Producer K. Sarada Devi
Context
Song Context: నే మొదలుపెడితే ఏ సమరమైనా,
నాకెదురుపడునా ఏ అపజయం!
Song Lyrics
||ప|| |అతడు|
సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా
||సాహసం ||
.
||చ|| |అతడు|
నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలం ఉంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా
|| సాహసం ||
.
||చ|| |అతడు|
అదరని బెదరని ప్రవృత్తి - ఒదగని మదగజమే మహర్షి
వేడితేనే నీ ఒడి చేరుతుందా - వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం - కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను.. రేయి ఒళ్లో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం
|| సాహసం ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా
. నే మనసుపడితే ఏ కలని అయినా చిటికె కొడుతూ నే పిలువనా .
Supreme Confidence!
………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world