Archive for May 1st, 2009

సంబరం: ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు

Posted by admin on 1st May 2009 in ఘర్షణ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Sambaram
Singers
   R.P. Patnaik
Music Director
   R.P. Patnaik
Year Released
   2003
Actors
   Nitin, Nikitha
Director
   Dasharath
Producer
   Teja

Context

Song Context:
   A boy who lost her is trying to start a new life!

Song Lyrics

||ప|| |అతడు|
       ఎందుకే ఇలా గుండె లోపల
       ఇంత మంట రేపుతావు అందని కలా
       అన్ని వైపులా అల్లుకోకిలా…
       ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
       వెంటాడుతు వేధించాలా - మంటై నను సాధించాలా
       కన్నీటిని కురిపించాలా - జ్ఞాపకమై రగిలించాలా
       మరుపన్నదే రానీయవా - దయలేని స్నేహమా 
                                    ||ఎందుకే ఇలా||
.
||చ|| |అతడు|
       తప్పదని నిను తప్పుకుని - వెదకాలి కొత్త దారి
       నిప్పులతో మది నింపుకుని - బతకాలి బాటసారి
       జంటగా చితి మంటగా గతమంతా వెంట ఉందిగా
       ఒంటిగా నను ఎన్నడూ ఒదిలుండనందిగా
       నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి
       ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి                   
                                     ||ఎందుకే ఇలా||
.
||చ|| |అతడు|
       ఆపకిలా ఆనాటి కలా అడుగడుగు తూలిపోదా
       రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక
       జన్మలో నువు లేవనీ ఇకనైన నన్ను నమ్మనీ
       నిన్నలో వదిలేయని ఇన్నాళ్ల ఆశనీ
       చెంతే ఉన్నా సొంతం కావనీ నిందించే కన్నా…
       నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా             
                                      ||ఎందుకే ఇలా||
.
.
                       (Contributed by Nagarjuna)

Highlights

తప్పదని నిను తప్పుకుని - వెదకాలి కొత్త దారి [Past is past, It is not the end of it. Let me start a new begining!]
.
“నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్న” [And I know how to go away when necessary]
……………………………………………………………………………………………….